దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న జాట్ రిజర్వేషన్ల అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆందోళన చెందుతున్నాడు. రిజర్వేషన్ల కోసం హర్యానాలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తున్న జాట్ సోదరులను అలాంటి చర్యలకు దిగవద్దని సూచించాడు. ఈ మేరకు తన ట్విట్టర్లో జాట్ సోదరులకు విజ్ఞప్తి అంటూ సందేశాలను పోస్ట్ చేశాడు. 'జాట్లు రక్షకులేగానీ, విధ్వంసకారులు' కాదు అని పేర్కొన్నాడు. రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటూ రిజర్వేషన్ల అంశంపై తమ డిమాండ్లను వ్యక్తపరచాలని సూచించాడు.
డాషింగ్ బ్యాట్స్ మన్, మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్వతహాగా జాట్ వర్గానికి చెందిన వాడన్న విషయం తెలిసిందే. క్రీడలు, ఆర్మీ, తమకు ఇష్టమున్న రంగాల్లో మన సత్తాచాటి దేశం గర్వపడేలా చేయాలని హింసాత్మక పనులు చేయవద్దంటూ కోరాడు. మరోవైపు రోహ్తక్, జింద్, భిబానీ, ఝజ్జర్, హిస్సార్ తదితర జిల్లాల్లో ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో సామాన్య జనజీవనం ఇక్కట్లుకు గురవుతుంది. ఆందోళన విరమించాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టార్ జాట్ వర్గీయులను కోరుతున్నప్పటికీ ఫలితం లేదు.
No comments:
Post a Comment