పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 22 February 2016

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ బీ.లక్ష్మికాంతం హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. ఆదివారం ఆర్‌డీటీ స్టేడియంలో జర్నలిస్టుల క్రికెట్ టోర్నీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి మచ్చారాలింగారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంపై చర్యలు చేపట్టాలని ఆర్డీఓకు సూచిస్తామన్నారు. సొసైటీలు ఎలా ఏర్పాటు చేయాలని అనే వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు.ప్రెస్‌క్లబ్‌కు మూడు కంప్యూటర్లు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జర్నలిస్టు ప్రీమియం లీగ్ చైర్మన్ రవివర్మ, నాయకులు జయరాం, జగదీశ్, శివ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment