టీడీపీకి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదని ఎమ్మె ల్సీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అన్నారు. శనివారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ మీడియాలో ప్రచారం చేయడం తగదన్నారు. పట్టిసీమ, పోలవరం, రాజధాని భూములు తదితర వాటిని అవినీతిగా చిత్రీకరించి చంద్రబాబును అపఖ్యాతి పాలు చేయాలని కుట్రపన్నుతారని ఆరోపించారు. టీడీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి సాధించి తీరుతామన్నారు.
No comments:
Post a Comment