యువతి మృతి.. యువకుడి పరిస్థితి విషమం
మంచిర్యాల టౌన్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మం డలం హాజీపూర్ పోలీసుస్టేషన్ సమీపంలో శనివారం ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల మండలం నంనూరుకు చెందిన యాదగిరి మల్లయ్య, ఐలమ్మ దంపతుల రెండో కుమారుడు సురేశ్(24) ఆటోడ్రైవర్. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం కనగరికి చెందిన చింతల బాపు, లక్ష్మి దంపతుల రెండో కూతురు చింతల సౌందర్య 22) సురేశ్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం సౌందర్య ఇంట్లో తెలియడంతో ఆరు నెలల క్రితం రెబ్బెనకు చెందిన గడ్డలపల్లికి చెందిన తిరుపతితో ఆమెకు వివాహం జరిపిం చారు.

వీరు ప్రస్తుతం పెద్దపల్లిలోనే నివాసం ఉంటున్నారు. వారం క్రితం సౌందర్య సురేశ్‌తో కలసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె భర్త తిరుపతి పెద్దపల్లి పోలీసుస్టేషన్‌లో ఈ నెల 16న ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో శనివారం ప్రేమికులిద్దరూ హాజీపూర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. స్టేషన్ సమీపంలోనే వారి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. ఆస్పత్రిలో సౌందర్య చనిపోరుుంది. సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
No comments:
Post a Comment