శరీర రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చు-తగ్గులకు లోనవుతున్నాయా? అయితే దీనికి కారణం మధుమేహం వ్యాధి భారినపడ్డారని అర్థం. ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, వ్యాయామాలను అనుసరించటం మరియు క్రమం తప్పకుండా మందులను వాడటం ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. మధుమేహ వ్యాధి కలగటానికి ముందు బహిర్గతమయ్యే లక్షణాల గురించి ఇక్కడ తెలుపబడింది. వీటి గురిం చిన అవగాహనా కలిగి ఉండటం వలన ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
నిజానికి, శరీరంలో తగిన స్థాయిలో ఇన్సులిన్ ఉత్పత్తి చెందకపోవటం లేదా ఉత్పత్తి చెందిన ఇన్సులిన్ కు శరీర కణాలు స్పందించకపోవటం వలన మధుమేహ వ్యాధి కలుగుతుంది. కానీ, కొన్ని సందర్భాలలో ఈ రెండు ఒకేసారి కలగవచ్చు. సాధారణంగా, రక్తంలో అధిక చక్కెర స్థాయిలు కలిగిన వారు అధిక మూత్ర విసర్జన (పాలీయూరియా) చేయటం, అధిక దాహంగా అనిపించటం (పాలీడిప్సియా) మరియు ఆకలి స్థాయిలు పెరగటం (పాలీఫేజియా) వంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. మధుమేహ వ్యాధి వలన చాలా రకాల సంకేతాలు హెచ్చరికలుగా బహిర్గతమవుతాయి. వీటిని గమనించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోండి. బహిర్గత లక్షణాల గురించి కింద పేర్కొనబడింది.
తరచుగా మూత్ర విసర్జన
తరచుగా మూత్ర విసర్జనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే మధుమేహ వ్యాధితో భాదపడుతున్నారని అర్థం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికం ఉండటం వలన తరచుగా మూత్ర విసర్జన జరుపుతారు. ఇన్సులిన్ తక్కిన స్థాయిలో విడుదల అవకపోవటం లేదా చైతన్య రహితంగా ఉండటం వలన మూత్రపిండాలు గ్లూకోస్ ను తిరిగి రక్తంలోకి శోషణ చెందించలేదు. ఫలితంగా, మూత్రపిండాలపై అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. అధికంగా ఉన్న గ్లూకోజ్ ను వీలినం చెండుంచుటకు గానూ, శరీరంలో ఉండే నీటిని అధికంగా గ్రహిస్తుంది. ఫలితంగా, మూత్రాశయం నిండినట్టుగా అనిపించి, తరచుగా మూత్రవిసర్జనకు వెళుతుంటారు.
ఆరని దాహం
దాహంగా అనిపించినపుడు నీరు తాగిన కూడా మీ దాహం తగ్గట్లేదా? అయితే ఇది మధుమేహ వ్యాధి అని చెప్పవచ్చు. ఆరని దాహంతో పాటుగా అధిక మూత్ర విసర్జన కూడా జరుపుతారు. అందుకంటే అధిక మూత్ర విసర్జన వలన శరీరంలో ఉండే నీరు కోల్పోతారు. ఫలితంగా దాహంగా అనిపించటం మరియు తాగిన నీరు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది.
అలసటగా అనిపించటం
మనం తీసుకునే ఆహరం నుండి గ్లూకోస్ రక్త ప్రవాహంలోకి చేరుతుంది. ఇలా చేరిన గ్లూకోజ్ ఇన్సులిన్ ప్రమేయం ద్వారా శరీర కణాలలోకి చేరుతుంది. ఈ గ్లూకోజ్ కణాలలో వినియోగింపబడి, శరీరానికి కావలసిన శక్తి ఉత్పత్తి చెందించబడుతుంది. ఇన్సులిన్ చైతన్య రహితంగా లేదా తగిన స్థాయిలో ఉత్పతి చెందకపోవటం వలన గ్లూకోజ్ కణాల భయటే ఉండిపోతుంది. ఫలితంగా, గ్లూకోజ్ వినియోగింపబడక, శక్తి ఉత్పత్తి చెందదు. దీని వలన నీరసంగా మరియు అలసటకు లోనవుతుంటారు.
ఇతర లక్షణాలు
పైన తెలిపిన లక్షణాలు మాత్రమేకాకుండా, మధుమేహ వ్యాధి కలిగినపుడు కింద తెలిపిన లక్షణాలు కూడా బహిర్గతమవుతాయి.
- అస్పష్టమైన దృష్టి
- పొడి మరియు దురదలతో కూడిన చర్మం
- తరచుగా ఇన్ఫెక్షన్ లకు గురవటం
సరైన ఆహార సేకరణ, మందులు మరియు వ్యాయామాలను అనుసరించటం వలన మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
No comments:
Post a Comment