పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 13 November 2015

ఏయూ బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గురువారం చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఏయూ విద్యార్థులను కేజీహెచ్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఏయూ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
జిల్లా వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకెళుతోందంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చేపట్టనున్న ఏయూ బంద్ కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ మద్దతు తెలిపారు.

No comments:

Post a Comment