మంత్రాలతో రోగాలు నయం చేస్తానని చెప్పి ఓ యువతిపై అత్యాచారం చేయబోయిన దొంగబాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని అక్బర్‌హిల్స్‌కు చెందిన మహ్మద్ సాదిక్ హుస్సేన్(32) మంత్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తుంటాడు. గత నెల 26న టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఆయేషా సిద్దిఖీ తన కుమార్తె సాలీయాసుల్తానా(17) ఆరోగ్యం బాగాలేకపోతే ఆమెను హుస్సేన్ వద్దకు తీసుకువెళ్లింది. పరీక్షించిన హుస్సేన్ రూ.5 వేలు తీసుకురావాలని చెప్పాడు. రూ. 5వేల ఫీజుతో వారు ఆదివారం హుస్సేన్ దగ్గరకు వెళ్లారు.
సాలీయాను హుస్సేన్ తనగదిలోకి తీసుకెళ్లి మాయమాటలు చెప్తూ వెకిలిచేష్టలతో అత్యచారం చేయబోయాడు. సాలీయా వెంటనే బయటకు వచ్చేసి విషయాన్ని తల్లికి తెలిపింది. ఈ ఘటనపై ఆయేషా సిద్దిఖీ ఆదివారం సాయంత్రం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మహ్మద్ సాదిక్ హుస్సేన్‌ను సోమవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. అతనిపై నిర్భయచట్టం, లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు

No comments:
Post a Comment