పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

ఎయిడ్స్‌ నియంత్రణకు ముందస్తు మందు

ఎయిడ్స్‌ మహమ్మారికి కళ్లెం వేసేందుకు సర్కారు మరిన్ని చర్యలు చేపడుతోంది. హెచ్‌ఐవీ సోకకుండా ఉండేందుకు ముందస్తుగా మందులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ప్రయోగాత్మకంగా చేపట్టే ఈ ప్రాజెక్టును.. ఆసియాలోనే అతిపెద్ద రెడ్‌లైట్‌ ఏరియా అయిన పశ్చిమబెంగాల్‌లోని సోనాగచ్చిలో ప్రారంభించనున్నారు. ఈమేరకు జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ(ఎన్‌ఏసీవో) కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతినిచ్చాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రీ-ఎక్స్‌పోజర్‌ ప్రొఫిలాక్సి్‌స(ప్రె్‌ప)మందును హెచ్‌ఐవీ నెగిటివ్‌ ఉన్న సెక్స్‌ వర్కర్లకు ఇస్తామన్నారు. దీనికి మెలిండా పౌండేషన్‌ ఆర్థికసాయం చేస్తోందని తెలిపారు.

No comments:

Post a Comment