పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 13 November 2015

షార్ట్‌సర్క్యూట్‌తో ఐదిళ్లు దగ్దం

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక పిఠాపురం రోడ్డులోని బ్రౌన్‌పేటలోని ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పక్కనున్న మరో నాలుగిళ్లకు అంటుకుని మొత్తం కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన కారణంగా రూ.2 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. పెద్దాపురం నుంచి అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి.

No comments:

Post a Comment