పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Thursday, 5 November 2015

దక్షిణ ఆఫ్రికా మరియు భారతదేశం మధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభం



భారీ అంచనాలతో దక్షిణాఫ్రికాతో సుదీర్ఘ సిరీస్‌ను ఆరంభించిన టీమిండియా.. తొలుత టీ-20, ఆ తర్వాత వన్డే సిరీస్‌లోనూ ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో పడింది..! డేంజర్‌ మ్యాన్‌ డివిల్లీర్స్‌ సృష్టించిన విధ్వసంతో బౌలర్లు.. నిండా 20 ఏళ్లు లేని యువ పేసర్‌ రబాడ దెబ్బకు మన బ్యాట్స్‌మెన్‌ బిత్తరపోయారు..! అన్ని విభాగాల్లో అదరగొట్టిన సఫారీలు.. సొంతగడ్డపై పులులుగా పేరున్న భారత్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు..! వరుస ఓటములతో ఢీలా పడ్డ టీమిండియా ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంలో ఉన్న సౌతాఫ్రికాతో సిసలైన సవాల్‌కు సిద్ధమైంది..! కెప్టెన్‌గా స్వదేశంలో తొలి టెస్టు సిరీస్‌లోనే కోహ్లీ... వరల్డ్‌ నెంబర్‌ వన్‌ టీమ్‌ను ఎదుర్కోనున్నాడు..! ఇషాంత్‌ గైర్హాజరీతో సొంతగడ్డపై స్పిన్‌ అస్ర్తాన్నే నమ్ముకొని సౌతాఫ్రికాతో 
సవాల్‌కు సన్నద్ధమయ్యాడు..! మరి అనుభవజ్ఞులు లేని జట్టుతో.. అద్భుత ఫామ్‌లో ఉన్న సఫారీలపై సవారీ చేస్తాడో లేదో చూడాలి..! 

No comments:

Post a Comment