పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Sunday, 21 February 2016

రకుల్ ప్రీత్ సింగ్ కొత్త బిజినెస్


రకుల్ ప్రీత్ సింగ్ కొత్త బిజినెస్♦ ఫిట్‌నెస్ రంగంలోకి నటి రకుల్‌ప్రీత్
♦ గచ్చిబౌలిలో ప్రారంభమైన అత్యాధునిక జిమ్
 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ రంగంలోకి అడుగుపెట్టారు. గచ్చిబౌలిలో ‘ఎఫ్ 45’ పేరుతో అత్యాధునిక జిమ్‌ను ఆమె నెలకొల్పారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఫిట్‌నెస్ స్టూడియో ప్రారంభోత్సవానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వ్యాయామ ప్రియులకు అవసరమైన అన్నిరకాల అత్యాధునిక ఎక్విప్‌మెంట్ తమ ఫిట్‌నెస్ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సరైన విధానంలో రోజుకు 45 నిమిషాలు వ్యాయామం చేస్తే చక్కని శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చన్నారు రకుల్.      - సాక్షి, వీకెండ్ ప్రతినిధి

No comments:

Post a Comment