దాదాపు శతాబ్ధంపైగా చరిత్ర కల్గిన ఆస్ట్రేలియా ఫుట్ బాల్ లీగ్ లో(ఎఎఫ్ ఎల్) ఓ మహిళ అంపైర్ గా బాధ్యతలు చేపట్టనుంది. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన ఎలినీ గ్లోఫిట్ సిస్(23) అనే యువతి ముగ్గురు సభ్యులతో కూడిన ఫీల్డ్ అంపైర్ల ప్యానెల్ లో చోటు దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఫుట్ బాల్ లీగ్ లో ఇలా మహిళను అంపైర్ గా నియమించడం ఇదే తొలిసారి కావడంతో ఆమె అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. ఆదివారం ఎస్సెన్ డాన్-కార్ల్ టన్ ల మధ్య జరిగే మ్యాచ్ లో ఎలినీ అంపైర్ పాత్ర పోషించనుంది
దీనిపై అంపైర్లలో ఒకరైన వాయ్నీ క్యాంప్ బెల్ మాట్లాడుతూ.. ఫుట్ బాల్ లీగ్ లో ఎలినీ అంపైర్ గా బాధ్యతలు చేపట్టనుండటం మరింత మంది మహిళలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.
No comments:
Post a Comment