మొహాలి: నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు దక్షిణాఫ్రికా లెఫ్టార్మ్ స్పిన్నర్ డీన్ ఎల్గర్. నాలుగు కీలక వికెట్లు తీసి టీమిండియా భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. కాగా, మొహాలి పిచ్ ఏ మాత్రం గుడ్ వికెట్ కాదంటూ విమర్శలు గుప్పించాడు ఎల్గర్.
'ఇది కచ్చితంగా మంచి వికెట్ కాదు. మేము అంతకుముందు ఆడిన పిచ్ ల కంటే ఇది భిన్నంగా ఉంది. మాకు వ్యతిరేకంగానే పిచ్ లు రూపొందిస్తారని తెలుసు. కానీ ఇది ఎంత మాత్రం గుడ్ వికెట్ కాదు. నా అభిప్రాయంగా మాత్రమే ఈ విషయం చెబుతున్నా. ఒకవేళ ఫలితం వచ్చినా ఇది మంచి వికెట్ కాదు' అని తొలి రోజు మ్యాచ్ ముగిసిన అనంతరం ఎల్గర్ అభిప్రాయపడ్డాడు. ఎల్గర్ 22 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడంతో టీమిండియా 201 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది.

No comments:
Post a Comment