పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 4 November 2015

భారత షూటర్లకు ఐదు పతకాలు


ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు భారత షూటర్లు ఐదు పతకాలు గెలి చారు. ప్రాచీ గడ్కరీ, గాయత్రి పవాస్కర్, ఆషి రస్తోగిలతో కూడిన భారత యూత్ మహిళల జట్టు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. వ్యక్తిగత విభాగంలో ప్రాచీ గడ్కరీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ మహిళల టీమ్ ఈవెం ట్‌లో మంపి దాస్, శ్రీయాంకలతో కూడిన భారత జట్టుకు రజతం దక్కింది. 50 మీటర్ల ఫ్రీ పిస్టల్ జూనియర్ పురుషుల ఈవెంట్‌లో సుమేధ్ కుమార్ కాంస్యం సాధించాడు. ఇదే విభాగంలో టీమ్ ఈవెం ట్‌లో సుమేధ్, అర్జున్ దాస్, సూరజ్ భంబానీలతో కూడిన భారత జట్టుకు రజతం లభించింది